జాగ్రత్త..! అని చెప్పి బామ్మ బంగారు గొలుసు చోరీ..
CTR: పెనుమూరులోని దొంగలు వృద్ధురాలిని మోసం చేసి బంగారు గొలుసుతో పరారయ్యారు. కాంతమ్మ బ్యాంకుకు వెళ్తుండగా ఇద్దరు వ్యక్తులు ఆమె వద్దకు వచ్చి 'దొంగతనాలు జరుగుతున్నాయి, మీ గొలుసు జాగ్రత్తగా దాచుకోండి' అని చెప్పగా.. కాంతమ్మ తన గొలుసును వారికి ఇవ్వగా, పేపరులో చుట్టినట్లు నటించి గొలుసు కాజేసి.. రాళ్లు ఉన్న పొట్లాన్ని ఆమెకు ఇచ్చారు. దాంట్లో గొలుసు లేకపోవడంతో కాంతమ్మ బోరున విలపించింది.