కేజీహెచ్‌లో పెయిన్ క్లినిక్ ఏర్పాటు

కేజీహెచ్‌లో పెయిన్ క్లినిక్ ఏర్పాటు

విశాఖపట్నం కింగ్ జార్జ్ హాస్పిటల్ (KGH)లో ఏర్పాటు చేసిన అత్యాధునిక 'నొప్పి చికిత్సా కేంద్రం' (Pain Clinic) ఆదివారం ఉదయం ప్రారంభం కానుంది. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై.సత్యకుమార్ దీనిని ప్రారంభిస్తారు. 'అంకానా' సంస్థ అందించిన కోటి రూపాయల విరాళంతో, బ్లడ్ బ్యాంక్‌పై అంతస్తులో నూతన పరికరాలతో ఈ కేంద్రాన్ని అభివృద్ధి చేశారు.