హెల్మెట్ వాడకంపై 18న ర్యాలీ

VZM: బొబ్బిలి టౌన్ హెల్మెట్ వాడకంపై ఈ నెల 18న ర్యాలీ ఉంటుందని మండల న్యాయసేవా కమిటీ బొబ్బిలి ఛైర్మన్ మరియు సీనియర్ సివిల్ జడ్జి శ్రీమతి అరుణశ్రీ తెలిపారు. ద్విచక్ర వాహనం నడిపే ప్రతి వాహన దారుడు హెల్మెట్ ధరించాలని, గౌరవనీయమైన ఉన్నత న్యాయస్థానం యొక్క ఆదేశాలు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా జరిగే కార్యక్రమంలో భాగం కావాలని పిలుపునిచ్చారు.