యూత్ కాంగ్రెస్ నిరసన.. దిష్టిబొమ్మ దహనం

యూత్ కాంగ్రెస్ నిరసన.. దిష్టిబొమ్మ దహనం

HYD: మొయినాబాద్ ఘటనపై కాంగ్రెస్ పార్టీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో గాంధీభవన్ ముందు యూత్ కాంగ్రెస్ నిరసన ప్రదర్శన చేపట్టింది. గత పదేళ్లలో రాష్ట్రాన్ని డ్రగ్స్ అడ్డాగా మార్చారని ఆరోపిస్తూ, మాజీ మంత్రి కేటీఆర్ దిష్టిబొమ్మను దహనం చేశారు. రాష్ట్రంలో డ్రగ్స్ సంస్కృతికి కేటీఆర్ బాధ్యత వహించాలని వారు డిమాండ్ చేశారు.