పేకాట శిబిరంపై పోలీసులు దాడి

పేకాట శిబిరంపై పోలీసులు దాడి

ప్రకాశం: దొనకొండ(M) చిన్న గుడిపాడు గ్రామ పొలాల్లో బుధవారం ఎస్సై రామకృష్ణ తన సిబ్బందితో పేకాట శిబిరంపై దాడి చేశారు. ఆరుగురు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ.40,370 నగదు, 6 సెల్ ఫోన్లను, 5 మోటార్ సైకళ్ళను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. మండలంలో చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటానని దొనకొండ ఎస్సై హెచ్చరించారు.