ఎన్నికల కమిషన్‌పై రాహుల్ కీలక వ్యాఖ్యలు

ఎన్నికల కమిషన్‌పై రాహుల్ కీలక వ్యాఖ్యలు

ఎన్నికల కమిషన్‌పై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు. తాము దేశం కోసం పనిచేస్తున్నామని, మోదీ కోసం కాదనేది ఈసీ గుర్తుంచుకోవాలని తెలిపారు. బీహార్ ఎన్నికల వేళ బీజేపీ రూ.10 వేల చొప్పున పంచినా ఈసీ చర్యలూ తీసుకోలేదని ఆరోపించారు. ఎన్నికల సంఘంపై ఎటువంటి చర్యలకు అవకాశం లేకుండా కేంద్రం ఓ చట్టం తీసుకొచ్చిందని.. తాము అధికారంలోకి రాగానే దాన్ని మార్చుతామన్నారు.