షార్ట్ సర్క్యూట్‌తో ఇల్లు దగ్ధం.. రూ.2లక్షల ఆస్తి నష్టం

SRPT: తుంగతుర్తి మండలం గానుగుబండ గ్రామంలో షార్ట్ సర్క్యూట్‌తో ఇల్లు దగ్ధమైన ఘటన శుక్రవారం చోటుచేసుకుంది. వివరాల్లోకెళ్తే గ్రామానికి చెందిన గూడెల్లి వీరమల్లు ఇంట్లో ఫ్యాన్‌కు ఉండే వైరు షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయి. దీంతో ఇంట్లో ఉన్న సామాగ్రి, టీవీ, బీరువా పూర్తిగా కాలిపోయాయి. దాదాపు రూ.2 లక్షల వరకు ఆస్తి నష్టం కలిగిందని వీరమల్లు ఆవేదన వ్యక్తం చేశారు.