అధికారులపై అసహనం వ్యక్తం చేసిన కలెక్టర్

అధికారులపై అసహనం వ్యక్తం చేసిన కలెక్టర్

NRPT: మరికల్లోని శాంతి నగర కాలనీలో నిర్మాణాల్లో ఉన్న ఇందిరమ్మ ఇళ్లను గురువారం కలెక్టర్ సిక్తా పట్నాయక్ పరిశీలించారు. బేస్మెంట్ లెవెల్ పూర్తి కాకపోవడంతో అధికారులపై అసహనం వ్యక్తం చేశారు. మండల కేంద్రానికి 65 ఇళ్లు మంజూరు కాగా వాటిలో 11 ఇళ్లు మాత్రమే బేస్మెంట్ లెవెల్ ఉన్నాయని, పనుల్లో వేగం పెంచాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు.