VIDEO: ఆరేపల్లిలో ఉచిత గాలికుంటు టీకాలు పంపిణీ
SDPT: కోహెడ మండలం ఆరేపల్లిలో మండల పశువైద్యాధికారి శ్రవణ్, తన వైద్య బృందం సమక్షంలో పశుసంవర్ధక శాఖ శిబిరాన్ని సర్పంచ్ బాబురాజు ప్రారంభించారు. గ్రామ పరిధిలోని అన్ని రకాల పశువులకు ఉచితంగా గాలికుంటు టీకాలు వేస్తున్నట్లు తెలిపారు. రైతులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, రైతులు తమ వెంట ఆధార్ కార్డు, మొబైల్ ఫోన్ తప్పకుండా తెచ్చుకోవాలని తెలిపారు.