డిపోలో అధిక ఛార్జీలతో ప్రయాణికుల ఆగ్రహం

BHPL: భూపాలపల్లి జిల్లా RTC డిపో నుంచి హనుమకొండ, గోదావరిఖని రూట్లలో పల్లె వెలుగు బస్సులను రద్దు చేసి, ఎక్స్‌ప్రెస్ బస్సులుగా మార్చి అధిక ఛార్జీలు వసూలు చేస్తున్నారని ప్రయాణికులు శుక్రవారం ఆరోపిస్తున్నారు. దీంతో అదనపు ఆర్థిక భారం పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. రెగ్యులర్ పల్లె వెలుగు సర్వీసులను పునరుద్ధరించాలని ప్రయాణికులు డిమాండ్ చేస్తున్నారు.