జిల్లా ప్రజలకు ఎస్పీ కీలక హెచ్చరిక
NDL: ప్రజలు సైబర్ నేరాలకు గురికాకుండా జాగ్రత్తలను పాటించాలని ఎస్పీ సునీల్ ఓ ప్రకటనలో హెచ్చరించారు. అపరిచితులతో డిజిటల్ లావాదేవీలు చేయవద్దని, ATMల వద్ద అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. వాట్సాప్‌లో వచ్చే APK ఫైల్స్ డౌన్‌లోడ్ చేయకూడదని హెచ్చరించారు. అత్యవసరం పేరుతో డబ్బులు అడిగే వ్యక్తులను నమ్మవద్దని, బ్యాంక్ వివరాలు, OTPలు ఎవరికీ చెప్పొదన్నారు.