'సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలి'
ASR: సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని డుంబ్రిగుడ ఎస్సై కే.పాపినాయుడు సూచించారు. మంగళవారం స్థానిక కేజీబీవీని ఎస్సై సందర్శించి విద్యార్థులతో సమావేశం నిర్వహించారు. స్మార్ట్ ఫోన్లు ఉన్నవారు ఆన్లైన్ మోసాలు, సైబర్ నేరాలు పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. తెలియని నెంబర్ల నుంచి వచ్చే మెసేజ్ క్లిక్ చేయవద్దని హెచ్చరించారు.