దీపావళి రోజు సాయంత్రం 6 వరకే స్వామి దర్శనం
VSP: సింహాచలం వరాహ లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానంలో సోమవారం నరక చతుర్దశి సందర్భంగా రాత్రి 7 గంటల వరకు, మంగళవారం అమావాస్య కావడంతో సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే దర్శనాలు కల్పిస్తున్నామని ఆలయ అధికారులు తెలిపారు. బుధవారం సహస్రం, గరుడ సేవ టిక్కెట్లు రద్దు చేశామన్నారు. 23 నుంచి 27వ తేదీ వరకు సహస్రనామార్చనం, స్వర్ణ పుస్పర్శనం నిత్యా కళ్యాణం సేవలు రద్దు చేశారు.