ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం

ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం

SDPT: హుస్నాబాద్ మండలం మీర్జాపూర్ గ్రామంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సర్పంచ్ వేల్పుల సంపత్ కుమార్, ఏఈఓ సంగీత సోమవారం ప్రారంభించారు. రైతులు దళారులను నమ్మి తక్కువ ధరకు అమ్మి మోసపోవద్దని, ప్రభుత్వం కల్పించిన మద్దతు ధరను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. రైతులు నాణ్యత ప్రమాణాలు పాటించి ధాన్యాన్ని కేంద్రానికి తీసుకురావాలని కోరారు.