ప్రభుత్వ ఆసుపత్రిని తనిఖీ చేసిన కలెక్టర్

SRD: సదాశివపేట ప్రభుత్వ ఆసుపత్రిని కలెక్టర్ ప్రావీణ్య మంగళవారం అకస్మికంగా తనిఖీ చేశారు. రోగులతో మాట్లాడి వైద్య సేవల గురించి అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రికి వచ్చే వారికి మెరుగైన వైద్య సేవలు అందించాలని కలెక్టర్ సూచించారు. నిర్లక్ష్యం వహించే వైద్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.