నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేసుకోవాలి

నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేసుకోవాలి

ప్రకాశం: గృహా నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేసుకోవాలని హౌసింగ్ ఏఈ హనుమంతరావు కోరారు. తాళ్లూరులో పలు కాలనీలలో అసంపూర్తిగా ఉన్న 61 గృహాలను మన ఇల్లు – మన గౌరవం కార్యక్రమంలో బాగంగా మంగళవారం సందర్శించారు. ఎస్సీ, బీసీలకు రూ.50వేలు, ఎస్టీలకు రూ.75వేలు అదనంగా ప్రభుత్వం ఇస్తుందని లబ్ధిదారులు ఉపయోగించుకుని పూర్తి చేసుకోవాలన్నారు.