'పది మీటర్ల దూరానికి 10 కి.మీ ప్రయాణం'

'పది మీటర్ల దూరానికి 10 కి.మీ ప్రయాణం'

విశాఖ జిల్లాలో భారీ వర్షాలకు భీమిలి - నర్సీపట్నం రహదారిపై విజయరామరాజుపేట వద్ద తాచేరు కాజ్ వే పూర్తిగా ధ్వంసమైంది. గతంలో కూలిపోయిన వంతెనకు బదులుగా నిర్మించిన ఈ తాత్కాలిక కాజ్ వే, రెండేళ్లు గడిచినా కొత్త వంతెన నిర్మాణం జరగలేదు. గతంలో కొంత దెబ్బతిన్నా మరమ్మతులు చేయగా, ఈసారి పూర్తిగా కొట్టుకుపోవడంతో మరమ్మతులు ఆలస్యమయ్యే అవకాశాలున్నాయి.