మంత్రి సీతక్కకు వినతి పత్రం
MHBD: జిల్లా కేంద్రంలో మంత్రి సీతక్కను గురువారం సాయంత్రం తుడుం దెబ్బ నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా తుడుం దెబ్బ నాయకులు మాట్లాడుతూ.. దేశవ్యాప్త కులగణనలో ఆదివాసీల ప్రత్యేక సాంస్కృతిక సంప్రదాయాలు, ఆచార-వ్యవహారాలను పరిగణనలోకి తీసుకొని ఆదివాసీలకు ప్రత్యేక మతం (ట్రైబల్ రిలీజన్) కేటాయించాలని కోరారు.