రైలు ఢీకొని వ్యక్తి మృతి

రైలు ఢీకొని వ్యక్తి మృతి

NLR: రైలు ఢీకొని ఓ వ్యక్తి మృతిచెందిన సంఘటన రాపూరు మండలంలో చోటు చేసుకుంది. మద్దెల మడుగు జంక్షన్ దగ్గరలో ఒక ధాబాలో వంట మాస్టర్‌గా పని చేస్తున్న అజయ్ నాయక్ (20) ఆదివారం రాత్రి రైలు ఢీకొని మృతి చెందిన సంఘటన సోమవారం వెలుగులోకి వచ్చింది. మృతుడు ఒరిస్సా రాష్ట్రానికి చెందినవాడు కాగా, కుటుంబ కలహాలతో మృతి చెందినట్లుగా అనుమానిస్తున్నారు.