VIDEO: మినీ డిపో ఏర్పాటు చేయాలని ధర్నా

VIDEO: మినీ డిపో ఏర్పాటు చేయాలని ధర్నా

ASR: పాడేరు మండలం దుమ్ముపుట్టు గ్రామంలో మినీ రేషన్ డిపో ఏర్పాటు చేయాలని గిరిజన సంఘం మండల కార్యదర్శి చిట్టిబాబు కోరారు. దుమ్ముపుట్టు, మసిపుట్టు, వల్లాపురం గ్రామాల్లో మొత్తం 161 రేషన్ కార్డులు ఉన్నాయన్నారు. వీరు దూరంగా ఉన్న డోకులూరు డిపోకు వెళ్లి రేషన్ తెచ్చుకోవడానికి ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఈమేరకు, డిపో ఏర్పాటు చేయాలని సోమవారం పాడేరులో ధర్నా చేశారు.