టెక్స్‌టైల్ పార్క్‌ పరిసరాలను పరిశీలించిన కలెక్టర్

టెక్స్‌టైల్ పార్క్‌ పరిసరాలను పరిశీలించిన కలెక్టర్

WGL: ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా గీసుకొండ మండలం శాయంపేటలో కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్క్‌లో వరద నీరు చేరిన విషయంపై ఆదివారం జిల్లా కలెక్టర్ సత్య శారద పరిశీలించారు. పార్క్ పరిసరాలను పరిశీలించిన కలెక్టర్ నీరు ప్రవేశించిన కారణాలు అధికారులను అడిగి తెలుసుకున్నారు. పరిశ్రమల కార్యకలాపాలకు అంతరాయం కలగకుండా శాశ్వత చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశం.