కానిస్టేబుల్ మృతదేహానికి నివాళి
సిరిసిల్ల: తల్లి మరణ వార్త తెలుసుకొని మానేరు వాగులో దూకి ఆత్మహత్య చేసుకున్న సిరిసిల్ల బెటాలియన్‌కు చెందిన అభిలాష్ మృతదేహానికి బెటాలియన్ కమాండెంట్ సురేష్ నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అభిలాష్ లేని లోటు ఎవరు పూడ్చలేనిదని పేర్కొన్నారు. అభిలాష్ మృతితో బెటాలియన్‌లో తీవ్ర విషాద ఛాయలు అలముకున్నాయని వివరించారు.