'పెన్షన్ పెంచిన ఘనత కూటమిదే'

ప్రకాశం: దోర్నాల పంచాయతీ కార్యాలయంలో నూతనంగా 81 మందికి వితంతు పెన్షన్లు మంజూరు అయ్యాయి. శుక్రవారం ఎర్రగొండపాలెం టీడీపీ ఇంఛార్జ్ గూడూరి ఎరిక్షన్ బాబు లబ్ధిదారులకు పెన్షన్లు అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. అధికారంలోకి రాగానే పెన్షన్ పెంచిన ఘనత కూటమి ప్రభుత్వానిదేనని అన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, అధికారులు పాల్గొన్నారు.