పేదోడికి భరోసా కల్పించడమే లక్ష్యం: MLA
MBNR: గత బీఆర్ఎస్ పాలనలో నిర్లక్ష్యానికి గురైన ప్రజా సంక్షేమాన్ని పునరుద్ధరించి, ప్రతి పేదవాడికి భరోసా కల్పించడమే తమ ప్రజా ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఆయన లబ్ధిదారులకు సీఎం సహాయ నిధి చెక్కులు అందజేశారు. ఆరోగ్యం, విద్య, ఉపాధి రంగాల్లో సంస్కరణలు తెచ్చి పాలమూరును అభివృద్ధి చేస్తామని తెలిపారు.