‘ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకొని బతుకుతున్నాం’

‘ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకొని బతుకుతున్నాం’

KDP: కాశినాయన మండలం వరికుంట్ల గ్రామంలో  కూలిపోవడానికి సిద్ధంగా ఉన్న విద్యుత్ స్థంభాలు, చిన్న పాటి గాలికి తెగిపడుతున్న కరెంట్ వైర్లతో ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకొని బతుకుతున్నామని గ్రామస్థులు వాపోతున్నారు. రాత్రి పూట కరెంట్ లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని పేర్కొన్నారు. అధికారులకు ఎన్నిసార్లు తెలిపినా పట్టించుకోలేదని ఆరోపించారు.