జెడ్పీ సీఈఓను కలిసిన సర్పంచ్ ప్రతినిధి

KDP: సిద్ధవటం మండలం పెద్దపల్లి పంచాయతీ సర్పంచ్ ప్రతినిధి తుర్ర ప్రతాప్ నాయుడు జెడ్పీ సీఈఓను మంగళవారం జడ్పీ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేశారు. గ్రామపంచాయతీ డెవలప్‌మెంట్ కోసం, గ్రామంలోని రోడ్లు మంజూరు గురించి సీఈఓకు వివరించారు. ఆమె సానుకూలంగా స్పందించి, మంజూరు చేస్తామని హామీ ఇచ్చారని ప్రతాప్ తెలిపారు.