తెలంగాణ యూనివర్సిటీ ఎదుట PDSU ధర్నా

తెలంగాణ యూనివర్సిటీ ఎదుట PDSU ధర్నా

నిజామాబాద్ జిల్లా తెలంగాణ యూనివర్సిటీలో ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాల ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ యూనివర్సిటీ ఎదుట PDSU ఆధ్వర్యంలో సోమవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా PDSU జిల్లా ప్రధాన కార్యదర్శి జన్నారపు రాజేశ్వర్ మాట్లాడుతూ.. అసెంబ్లీలో ఇంజనీరింగ్ కళాశాలపై జిల్లా ప్రజా ప్రతినిధులు మాట్లాడాలని కోరారు. ఈ కార్యక్రమంలో అక్షయ్, నిఖిల్, బిందు ఉన్నారు.