జోరుగా సాగుతున్న 'స్వయంభు' ప్రమోషన్స్
నిఖిల్ సిద్ధార్థ్ హీరోగా భరత్ కృష్ణమాచారి దర్శకత్వంలో వస్తున్న పాన్ ఇండియా ప్రాజెక్ట్ ‘స్వయంభు’ విడుదలకు సిద్ధమవుతోంది. తాజాగా గుంటూరులోని మహిళా ఇంజినీరింగ్ కళాశాలలో ప్రమోషనల్ ఈవెంట్ జరిగింది. ఇందులో నిఖిల్ విద్యార్థినులతో కలిసి చేసిన డ్యాన్స్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ చిత్రంలో నిఖిల్ యుద్ధ వీరుడిగా కొత్త లుక్‌లో కనిపించనున్నాడు.