'కూలీ బిడ్డ సత్తా చాటాడు'

KMM: ఖమ్మం రూరల్ మండలం గొల్లపాడుకు చెందిన బొందల నరసింహారావు- రాణి దంపతుల కుమారుడు వీరభద్రం ఇంటర్ ఫలితాల్లో సత్తా చాటాడు. ప్రభుత్వ రెసిడెన్షియల్ కళాశాలలో చదివి 462/470 మార్కులు సాధించాడు. తల్లిదండ్రులు కూలీ పనులు చేసుకుంటుండగా, విద్యార్థి ప్రతిభపై పలువురు అభినందిస్తున్నారు.