క్రమశిక్షణతో కూడిన విద్యను అభ్యసించాలి

క్రమశిక్షణతో కూడిన విద్యను అభ్యసించాలి

ADB: విద్యార్థులు క్రమశిక్షణతో కూడిన విద్యను అభ్యసించి ఉన్నత శిఖరాలకు ఎదగాలని బోథ్ సీఐ వెంకటేశ్వర్లు అన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని ప్రాథమిక పాఠశాలలో పోలీస్ స్టేషన్ తరఫున విద్యార్థుల సౌకర్యార్థం ప్లేట్స్ అందజేశారు. విద్యార్థులు సోషల్ మీడియాకు దూరంగా ఉండాలని సూచించారు. కార్యక్రమంలో ఎస్సై శ్రీ సాయి, మాసం అనిల్, HM గంగారం ఉన్నారు.