నాకు దేవుడిపై నమ్మకం లేదు: రాజమౌళి
ప్రముఖ దర్శకుడు రాజమౌళి దేవుడిపై మాట్లాడిన పాత వీడియో తాజాగా నెట్టింట వైరలవుతోంది. 'నాకు దేవుడిపై నమ్మకం లేదు. నా తల్లిదండ్రులకు ఉన్న విశ్వాసాన్ని గౌరవిస్తా. హిందూ ధర్మంలో.. భక్తియోగంలో మాత్రమే దేవుడు ఉన్నాడు. కర్మయోగంలో చెప్పినట్లుగా నా పని నేను చేసుకుంటా' అని అన్నాడు. కాగా ఇటీవల రాజమౌళి దేవుడిపై చేసిన వ్యాఖ్యలు వివాదంగా మారిన విషయం తెలిసిందే.