చిత్రసంపదకు నిలయంగా చెర్వు అన్నారం గుట్ట
NLG: కట్టంగూరు మండలం చెర్వు అన్నారం గుట్ట చిత్రసంపదకు నిలయంగా అవతరించింది. చరిత్ర పూర్వ యుగం నుంచి మధ్యయుగాల దాకా విస్తరించిన ఆనవాళ్లు ఒకే ప్రదేశంలో దర్శనమివ్వడం విశేషం. గ్రామస్తుల క్షేత్రపరిశీలనలో ఈ అరుదైన ఆధారాలు వెలుగులోకి వచ్చాయి. స్థానిక యువకుల సహకారంతో గుట్టపై సమగ్ర పరిశీలన నిర్వహించారు. దీనిపై అధికారులు చొరవ తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.