VIDEO: కూలిపోయిన కోళ్ల ఫారం.. భారీగా ఆస్తి నష్టం

MNCL: నెన్నెలలోని గంగారంలో షెగ్గం రాజమొగిలికి చెందిన కోళ్ల ఫారం కూలిపోయింది. గురువారం తెల్లవారుజామున వీచిన భారీ ఈదురుగాలులు, రాళ్ల వర్షానికి ఫారం పూర్తిగా నేలమట్టమైంది. సుమారు రూ.7లక్షల వరకు నష్టపోయాయని బాధితుడు వాపోయాడు. అధికారులు స్పందించి తనకు నష్టపరిహారం అందజేయాలని వేడుకుంటున్నాడు.