ఉరేసుకుని యువకుడి ఆత్మహత్య
NDL: బండి ఆత్మకూరు మండలం జి. లింగాపురం గ్రామానికి చెందిన యువకుడు ఆది ఈశ్వర్ బుధవారం రాత్రి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో అతను ఈ చర్యకు పాల్పడినట్లు గ్రామస్థులు తెలిపారు. విషయం తెలుసుకున్న బండి ఆత్మకూరు పోలీసులు విచారణ చేపట్టారు. యువకుడి ఆత్మహత్యకు గల కారణాలు, మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.