బైక్ ఢీకొని గొర్రెల కాపరి మృతి

బైక్ ఢీకొని గొర్రెల కాపరి మృతి

కృష్ణా: ఘంటసాల రజకపేటకు చెందిన కొడాలి దేవిచంద్రరావు (29) బుధవారం సాయంత్రం గొర్రెలను మేపి ఇంటికి తిరిగి వస్తుండగా బైక్ ఢీకొని తీవ్రంగా గాయపడ్డాడు. 108 సిబ్బంది చలపల్లి ఆసుపత్రికి తరలించగా, మెరుగైన చికిత్స కోసం విజయవాడకు తీసుకెళ్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.