ఈనెల 28న జాబ్ మేళా

ప్రకాశం: సింగరాయకొండలో ఆంధ్రప్రదేశ్ జిల్లా నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ఈనెల 28న జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా నైపుణ్య అభివృద్ధి అధికారి రవితేజ యాదవ్ తెలియజేశారు. ఈ జాబ్ మేళాలో ప్రముఖ కంపెనీలు పాల్గొంటున్నట్లు పేర్కొన్నారు. జిల్లాలోని నిరుద్యోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన పేర్కొన్నారు.