జనగామలో 81.20% పోలింగ్
JN: జిల్లాలో రెండో విడత పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. ఉదయం 7 నుంచి మద్యాహ్నం ఒంటి గంట వరకు మాత్రమే నాలుగు మండలాల్లో కలిపి 81.20 శాతం పోలింగ్ నమోదయింది. బచ్చన్నపేటలో 70.03 శాతం, జనగామలో 88.53 శాతం, తరిగొప్పులలో 85.38 శాతం, నర్మెట్టలో 87.28 శాతం నమోదయింది.