జిల్లా పేరు మార్పుపై రౌండ్ టేబుల్ సమావేశం
ELR: ఏలూరు జిల్లాను 'గోదావరి జిల్లా' లేదా 'ఉత్తర గోదావరి జిల్లా' గా పేరు మార్చాలనే డిమాండ్ పై జంగారెడ్డిగూడెం ఆర్యవైశ్య కల్యాణ మండపంలో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. కొత్త జిల్లాల ఏర్పాటు నేపథ్యంలో తమ ప్రాంతానికి గోదావరి అనుబంధాన్ని చాటే పేరు కావాలని మెట్ట ప్రాంత ప్రజలు కోరుకుంటున్నారని సమావేశంలో పాల్గొన్న నాయకులు పేర్కొన్నారు.