హెల్మెట్ ధరించడంపై వాహనదారులకు అవగాహన
కృష్ణా: మచిలీపట్నం ట్రాఫిక్ సీఐ ఎన్.రాజు వాహనదారులకు ఆదివారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ద్విచక్ర వాహనదారులకు హెల్మెట్ ధరించడం ప్రాణ రక్షణకు ఎంత ముఖ్యమో ఆయన వివరించారు. రోడ్డు ప్రమాదాల సమయంలో తలకు తీవ్ర గాయాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉండటంతో హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని సూచించారు.