రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలిపిన మండలి ఛైర్మన్

రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలిపిన మండలి ఛైర్మన్

NLG: జిల్లా సోదరీమణులకు రక్షాబంధన్ సందర్భంగా శనివారం తెలంగాణ శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. అన్నాచెల్లెళ్ల అనుబంధానికి ప్రతీక రక్షాబంధన్ అని పేర్కొన్నారు. రాఖీ పండుగను జిల్లా వ్యాప్తంగా ఘనంగా నిర్వహించుకోవాలని సూచించారు. తెలంగాణ రాష్ట్ర మహిళా అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తుందన్నారు.