రిమ్స్ పారామెడికల్ విద్యార్థికి స్టేట్ రెండవ ర్యాంక్

కడప: నగర పరిధిలోని రిమ్స్ ప్రభుత్వ వైద్య కళాశాల నందు పారామెడికల్ కోర్సు డిప్లమా ఇన్ అనస్థీసియా టెక్నికల్ కోర్సులో చింతకొమ్మదిన్నె మండలం నాగిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన శివదుర్గ నాగేంద్ర అనే విద్యార్థి 80% శాతం మార్కులతో స్టేట్ 2వ ర్యాంకు సాధించాడు. కష్టపడి చదివి స్టేట్‌లో మంచిర్యాంకు సాధించినందుకు వైద్యులు తోటి విద్యార్థులు ఆయనకు అభినందనలు తెలిపారు.