ఘనంగా వినాయకుడి రథోత్సవ వేడుకలు

ATP: రాయదుర్గం పట్టణం కోటలో వెలిసిన వినాయకుడి రథోత్సవం వేడుకలు బుధవారం భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. వినాయకుడి ఉత్సవమూర్తిని రథోత్సవంపై కొలువు తీర్చి ఆలయం నుండి పురవీధుల్లో ఊరేగింపు నిర్వహించారు. వినాయక చవితి సందర్భంగా ప్రతి ఏడాది రథోత్సవ వేడుకలు నిర్వహిస్తున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు.