పాక్ దాడి.. మృతులకు పరిహారం ప్రకటన

సరిహద్దుల్లో పాకిస్తాన్ జరిపిన కాల్పుల్లో చనిపోయిన పౌరుల కుటుంబాలకు జమ్మూకశ్మీర్ ప్రభుత్వం పరిహారం ప్రకటించింది. ఒక్కొక్కరికి రూ.10 లక్షల చొప్పున పరిహారాన్ని ఇవ్వనున్నట్లు సీఎం ఒమర్ అబ్దుల్లా వెల్లడించారు. గత రాత్రి పాక్ చేసిన దాడుల్లో పోలీసు అధికారి సహా ఐదుగురు మృతి చెందిన విషయం విధితమే.