VIDEO: రోడ్డు ప్రమాదంలో వ్యక్తికి తీవ్ర గాయాలు

VIDEO: రోడ్డు ప్రమాదంలో వ్యక్తికి తీవ్ర గాయాలు

ప్రకాశం: బేస్తవారిపేట మండలంలోని చింతలపాలెం క్రాస్ రోడ్ సమీపంలో బుధవారం రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో కారు, ద్విచక్ర వాహనం ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఘటనలో కర్నాటి గురవారెడ్డి అనే వ్యక్తికి తీవ్ర గాయాలు కావడంతో చికిత్స నిమిత్తం 108 వాహనం ద్వారా కంభం ప్రభుత్వ ఆసుపత్రి తరలించారు. దీనిపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.