చిత్తలూరులో యూరియా పంపిణీ

చిత్తలూరులో యూరియా పంపిణీ

NLR: చేజర్ల మండలం చిత్తలూరులో యూరియా పంపిణీ ప్రారంభమైంది. వ్యవసాయ అధికారిణి హిమబిందు నేతృత్వంలో మంగళవారం జొన్నలు, శనగలు, మినుములు విత్తుకున్న రైతులకు యూరియా అందజేశారు. సమయానికి ఎరువులు అందడంతో రైతులు సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా హిమబిందు మాట్లాడుతూ.. వర్షాల పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని సమయానికి ఎరువులు వేస్తే దిగుబడి మెరుగవుతుందని సూచించారు.