ప్రజలతో ప్రత్యక్ష భేటీ
PDPL: రామగుండం కార్పొరేషన్ 12వ డివిజన్‌లో ప్రజల సమస్యలు తెలుసుకోవడం కోసం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ ఆదేశాల మేరకు మనాలి ఠాకూర్ విస్తృత పర్యటన చేశారు. రహదారులు, కాలువలు, తాగునీరు, స్ట్రీట్ లైట్ల సమస్యలను ప్రజలు వివరించగా, ఆమె వెంటనే ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లి త్వరితగతిన పరిష్కారం కోసం చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, మహిళలు పాల్గొన్నారు.