దాడులు జరిగితే ఇక నుంచి ఊరుకోం: మధుసూదనాచారి
HNK: బాలసముద్రంలోని బీఆర్‌ఎస్ కార్యాలయంలో గురువారం శాసనమండలి ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి మీడియాతో మాట్లాడారు. బీఆర్‌ఎస్ శ్రేణులపై దాడి, అణచివేత జరిగితే ఇక నుంచి ఊరుకోమని హెచ్చరించారు. గ్రేటర్ వరంగల్ ముంపు ప్రాంతాల్లో సీఎం మొక్కుబడి పర్యటన చేశారని ఆరోపించారు. అధికారులు నిష్పక్షపాతంగా వ్యవహరించాలని డిమాండ్ చేశారు.