ఈనెల 5వ తేదీన పోలీసుల ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం

ఈనెల 5వ తేదీన పోలీసుల ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం

ASF: కెరమెరి మండలంలో ఈనెల 5వ తేదీన పోలీసుల ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహిస్తున్నట్లు పోలీసు సిబ్బంది శుక్రవారం తెలిపారు. ప్రజలు మూఢ నమ్మకాలతో నాటు వైద్యాన్ని ఆశ్రయించకుండా, శాస్త్రీయ వైద్యం పొందాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టినట్లు పేర్కొన్నారు. ఈ శిబిరానికి ప్రజలు, రోగులు పెద్ద ఎత్తున హాజరై సద్వినియోగం చేసుకోవాలని పోలీసులు కోరారు.