ఎస్పీ పేరుతో నకిలీ ఫేస్‌బుక్ ఖాతాలు

ఎస్పీ పేరుతో నకిలీ ఫేస్‌బుక్ ఖాతాలు

SRPT: జిల్లా ఎస్పీ కె. నరసింహ పేరుతో సైబర్ కేటుగాళ్లు నకిలీ ఫేస్‌బుక్ ఖాతాలు సృష్టించి మోసాలకు తెరలేపారు. తక్కువ ధరకే ఫర్నిచర్ ఇప్పిస్తామంటూ సందేశాలు పంపుతున్నట్లు గుర్తించిన ఎస్పీ ప్రజలను అప్రమత్తం చేశారు. తన పేరుతో వచ్చే మెసేజ్‌లకు స్పందించి డబ్బులు పంపి మోసపోవద్దని, సైబర్ నేరగాళ్ల పట్ల జాగ్రత్తగా ఉండాలని ఎస్పీ ప్రజలకు సూచించారు.