టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శిగా పరిటాల శ్రీరామ్
సత్యసాయి: టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శిగా ధర్మవరం టీడీపీ ఇన్‌ఛార్జి పరిటాల శ్రీరామ్ నియమితులయ్యారు. ఈ మేరకు పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. యువ నాయకుడిగా పార్టీ బలోపేతానికి ఆయన చేస్తున్న కృషిని గుర్తించి ఈ కీలక బాధ్యత అప్పగించారు. శ్రీరామ్ నియామకం పట్ల ఉమ్మడి అనంతపురం జిల్లాలోని పార్టీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.